ETV Bharat / city

ముందు 50 కోట్లు కట్టండి.. ! ఎల్​జీ పాలిమర్స్​కు ఎన్జీటీ ఆదేశం. - విశాఖ గ్యాస్ లీక్

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. పలు సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఎన్​జీటీ... ముందస్తుగా 50 కోట్ల పరిహారాన్ని జమ చేయాలని ఎల్​జీ పాలిమర్స్​ను ఆదేశించింది.

50 కోట్లు జమచేయండి.. ఎల్జీకి ఎన్జీటీ నోటీసులు

author img

By

Published : May 8, 2020, 2:57 PM IST

Updated : May 8, 2020, 4:31 PM IST

విశాఖ నగరంలో హానికారక స్టైరీన్ వాయు లీకేజీపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్​జీటీ ఛైర్​పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలో విచారణ చేపట్టిన బెంచ్ ఈ ఘటనపై 5 గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. మే 18 నాటికి నివేదిక ఇవ్వాలని సూచించింది. వాయు లీకేజీ ఘటనకు ఎల్​జీ పాలిమర్స్ సంస్థ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టానికి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాలకు జరిగిన నష్టాన్ని బేరీజు వేసి.. ముందస్తుగా 50 కోట్ల మొత్తాన్ని జిల్లా కలెక్టర్​కు జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చింది. కంపెనీ ఆర్థిక పరిస్థితి, జరిగిన నష్టాన్ని మదింపు చేసి పరిహారం ఎంత చెల్లించాలన్నది నిర్ణయిస్తామని చెప్పింది.

పూర్తి నిర్లక్ష్యం

విశాఖలో జరిగిన ఘటనపై ఎన్​జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్పింది. హానికారక రసాయనాలు నిల్వ, తయారీ, దిగుమతి నిబంధనలు -1989 ను సంస్థ పాటించలేదని చెప్పింది. "చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉందని" బెంచ్ అభిప్రాయపడింది. వీటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు, అనుమతులు ఇచ్చిన సంస్థలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జరిగే మే 18వ తేదీ నాటికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖతో పాటు, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, ఎల్​జీ పాలిమర్స్, విశాఖ కలెక్టర్ తమ వివరణలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

కమిటీ సభ్యులు వీరే...

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయన రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ రామచంద్రమూర్తి, ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య పులిపాటి కింగ్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరక్టర్, విశాఖలోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ- (నీరి) విభాగాధిపతిని సభ్యులుగా నియమించారు. వీరు సంఘటన జరిగిన క్రమంతో పాటు, ప్రమాదానికి కారణాలు, వైఫల్యాలు, దానికి బాధ్యులైన వ్యక్తులు, జరిగిన నష్టం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ కోరింది. తదుపరి విచారణ జరిగే మే 18నాటికి కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. విశాఖ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను ప్రాతిపదికగా తీసుకుని ఎన్​జీటీ ఈ కేసును సుమోటోగా తీసుకుంది.

ఇదీ చదవండి : పంజాబ్​లో కూలిన మిగ్​-29 యుద్ధ విమానం-పైలట్​ సేఫ్​

Last Updated : May 8, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.