ETV Bharat / city

నేడు రాష్ట్రానికి రానున్న ఎన్డీయే రాష్రపతి అభ్యర్థి ముర్ము

author img

By

Published : Jul 12, 2022, 5:04 AM IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము నేడు రాష్ట్రానికి రానున్నారు. మంగళగిరిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం కానున్నారు. సమావేశానంతరం ఆమెకు ముఖ్యమంత్రి జగన్‌ మర్యాదపూర్వకంగా తన నివాసంలో తేనీటి విందు ఇవ్వనున్నారు.

నేడు రాష్ట్రానికి రానున్న ఎన్డీయే రాష్రపతి అభ్యర్థి ముర్ము
నేడు రాష్ట్రానికి రానున్న ఎన్డీయే రాష్రపతి అభ్యర్థి ముర్ము

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఇవాళ వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. మంగళగిరిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం గంటపాటు ఈ సమావేశం జరగనుంది. సమావేశానంతరం ఆమెకు ముఖ్యమంత్రి జగన్‌ మర్యాదపూర్వకంగా తన నివాసంలో తేనీటి విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే అభ్యర్థి ముర్ముకు వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి మంగళగిరిలోని ఫంక్షన్‌హాల్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్‌ ఆమెకు స్వాగతం పలకనున్నారు. అక్కడే వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినీ ఆమెకు సీఎం పరిచయం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రాష్ట్రానికి వస్తున్నారని వైకాపా వర్గాలు తెలిపాయి. ముర్ము వెంట కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఆమెకు ముఖ్యమంత్రి తేనీటి విందునివ్వనున్నారు. అనంతరం ఆమె బయల్దేరి వెళ్లనున్నారు.

ద్రౌపదీ ముర్ముకు తెదేపా మద్దతు: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘గతంలోనూ కె.ఆర్‌.నారాయణన్‌, ఏపీజే అబ్దుల్‌ కలాంలను తెదేపా బలపరిచింది. బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభాపతిగా ప్రతిభా భారతికి అవకాశమిచ్చింది. కింజరాపు ఎర్రన్నాయుడిని కేంద్ర మంత్రిని చేయడంద్వారా సామాజిక న్యాయానికి తెదేపా పెద్ద పీట వేసింది. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావును నంద్యాల ఎన్నికల్లో బలపరిచింది. తెలుగువారి కోసం, సామాజిక న్యాయం కోసం తెదేపా ముందు వరుసలో నిలిచింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.