కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, మూడో వేవ్ అప్రమత్తత తదితర అంశాలపై జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ నెల 13వ తేదీన జాతీయ ఆరోగ్య మిషన్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సూచించింది. జిల్లాస్థాయిలో జాతీయ ఆరోగ్య మిషన్ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పర్యవేక్షణ బాధ్యతను ఇటీవలే ప్రభుత్వం కలెక్టర్ల నుంచి జేసీలకు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా వారందరికీ ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి: nara lokesh: 'జగన్ తన బంధువులను రాబందుల్లా మన్యంపైకి వదిలారు'