ETV Bharat / city

గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం: లోకేశ్ - franklin templeton investments in ap

గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దొడ్డిదారిలో ప్రభుత్వం తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి చేసిన కుట్రకు బ్రేకులు పడ్డాయని ట్విట్టర్​లో లోకేశ్ ఆరోపించారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండండని ఆయన భరోసా నిచ్చారు.

appsc interviews cancelation
గ్రూప్-1 ఇంటర్వ్యూల రద్దుపై లోకేశ్
author img

By

Published : Jun 16, 2021, 9:25 PM IST

గ్రూప్-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత భవితని దెబ్బతీసే విధంగా గ్రూప్-1 పరీక్షల్లో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని ట్విట్టర్​లో లోకేశ్ ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి.. వేలాది మంది అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.

దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి చేసిన కుట్ర బయటపడిందని విమర్శించారు. విజయానికి ఇది మొదటి మెట్టని.. ఆఖరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండండని భరోసా నిచ్చారు. అర్హులైన వారికే ఉద్యోగాలు అనే డిమాండ్​తో మన పోరాటం కొనసాగిద్దామని అని ట్వీట్ చేశారు.

  • గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించింది. రేపటి నుండి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారిచెయ్యడం హర్షణీయం. నిరుద్యోగయువత భవితని దెబ్బతీసే విధంగా గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారు @ysjagan అండ్ గ్యాంగ్.(1/3) pic.twitter.com/LF6l50Qnt5

    — Lokesh Nara (@naralokesh) June 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జె టాక్స్​లు చెల్లించలేకే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్లిపోతోంది..

జె టాక్స్​లు చెల్లించలేకే రాష్ట్రం నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్లిపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రపంచ‌ ప్రఖ్యాత 500 కంపెనీల్లో ఒక్కటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గొప్పతనం జగన్​రెడ్డికి తెలుసు కాబట్టే 9 కోట్ల షేర్లు కొని పెట్టుబ‌డిగా ఉంచారన్నారు. అంత‌టి కంపెనీని ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కోర్చి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘ‌న‌త చంద్రబాబుదేనని గుర్తుచేశారు. 5 రూపాయల కోసం టిక్‌టాక్‌లో బైబై బాబూ అని పెయిడ్ వీడియోలు పెట్టిన‌ పేటీఎం కూలీలు.. ఇప్పుడు బైబై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వీడియోలు పెట్టాలని ఎద్దేవా చేశారు.

  • ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుసు ఫార్చ్యూన్‌-500 కంపెనీల‌లో ఒక్క‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం అని నేన‌నుకోను. ఎందుకంటే ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత 500 కంపెనీల‌లో ఇది ఒక‌టి. ఇందులో ఫ్రాడ్‌స్టార్ ఏ1 రెడ్డి అక్ష‌రాలా 9 కోట్ల షేర్లు కొని పెట్టుబ‌డిగా వుంచారు.(1/3)@ysjagan pic.twitter.com/DsRF16yk2X

ఇదీ చదవండి:

CM Jagan: కొవిడ్‌ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దు: సీఎం జగన్‌

యువకుడి చేతులు కట్టేసి.. చితకబాదుతూ వీడియో తీసి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.