-
అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021
అవ్వా తాతల్ని జగన్ ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని.. 250 రూపాయలు మాత్రమే పెంచి ఆగిపోయారని అన్నారు. ఒకటో తారీఖునే తలుపులు విరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయని ధ్వజమెత్తారు. 1వ తేదీ 5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదని ఆక్షేపించారు. ప్రతీనెలా టెక్నికల్ ప్రాబ్లమేనా లేక అప్పు దొరకడంలేదా అని నిలదీశారు.
ఇవ్వాలనే మనసుండాలే కానీ, తమ దగ్గరే లక్షల కోట్లు మూలుగుతున్నాయని దుయ్యబట్టారు. వాళ్లనీ, వీళ్లనీ అప్పులు అడగడం ఏమీ బాలేదని.. ఒక్క నెల జే ట్యాక్స్‌లో 10 శాతం వెచ్చిస్తే అందరికీ పింఛన్లు ఇచ్చేయొచ్చని ఎద్దేవాచేశారు. క్విడ్‌ప్రోకో ద్వారా కూడగట్టిన అక్రమాస్తులలో 1 శాతం అమ్మితే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయని తెలిపారు. పింఛన్లు లేటు చేస్తే, పెంపు గురించి అడగరనే లాజిక్ అమలు చేస్తున్నారన్నారు. అందుకే... పింఛన్ ఇచ్చే ఒకటో తేదీని జగన్ రెడ్డి, అలా అలా పెంచుకుంటూ పోతున్నారా అని దుయ్యబట్టారు.
ముసలి వాళ్లను మోసం చేసిన ఘనత జగన్ దే: డోలా బాల వీరాంజేయస్వామి
ముఖ్యమంత్రి పదవి కోసం ముసలివాళ్లను కూడా మోసం చేసిన ఘనత జగన్ దే అని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయస్వామి దుయ్యబట్టారు. జూలై 8న వైఎస్ జయంతికి పింఛన్ 2,250 రూపాయల నుంచి 2,500 కు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ ఆగస్టు నెల కూడా 2,250 ఇచ్చి మళ్లీ మాట తప్పారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం జగన్ తమను మోసం చేశారని వృద్దులు, వితంతవులు, వికలాంగులు వాపోతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు 45 ఏళ్లకే ఫించన్ ఇస్తామని చెప్పి... అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫించన్ దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ వరకు అన్నింటా జగన్ మాటతప్పారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు నెల నుంచే ఫించన్ 2500 ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: