ETV Bharat / city

పథకం ప్రకారం భర్త హత్య.. గొడవలో బయటపడ్డ నిజం - భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి.. గుండెపోటుగా చిత్రికరించింది ఓ భార్య. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. అయితే నిజం ఎక్కువ రోజులు దాగదు అన్న విధంగా.. అత్తమామలతో గొడవ పడటంతో.. తానే హత్య చేసినట్టు అసలు విషయం బయట పెట్టింది.

murdered-along-with-lover-a-wife
పథకం ప్రకారం భర్త హత్య
author img

By

Published : Feb 13, 2021, 3:45 PM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తన భర్తను హత్య చేసి.. గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మమతను అదే గ్రామానికి చెందిన జక్కలి రామకృష్ణ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి భర్త ఫ్రెండ్ అయిన రాజశేఖర్ ప్రవేశించాడు. తరచూ రామకృష్ణతో ఇంటికొచ్చే అతనికి.. మమతతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఏడాది నుంచి వీరి సంబంధం కొనసాగుతూ వస్తోంది. అయితే వీరి సంబంధానికి భర్త అడ్డువస్తుండటంతో అతడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం భార్య, ప్రియుడు కలిసి గత నెల 11న రాత్రి సమయంలో హత్య చేసి, గుండె పోటుగా చిత్రీకరించారు. నిజమేనని నమ్మిన బంధువులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

గొడవ నిజం చెప్పించింది..

పది రోజుల క్రితం మమత అత్తమామలతో గొడవ పడింది. ఆ గొడవలో 'నా కొడుకును నువ్వే చంపావని' అత్తమామలు అనడంతో.. 'అవును నేనే చంపాను ఏం చేసుకుంటవో చేసుకోపో' అని మమత అనేసింది.

అనుమానించిన రామకృష్ణ తల్లిదండ్రులు ఎస్పీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారించగా.. ప్రియుడు రాజశేఖర్​తో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.

రామకృష్ణ చిట్టీల వ్యాపారం చేసుకుంటూ, మొబైల్ షాపు నడిపేవాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మృతుని తల్లిదండ్రులు తెలిపారు. ఈ హత్య వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునిపై విషప్రయోగం జరిగిందా అనే విషయాలు తెలుసుకోవడానికి మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: యాప్​లో పరిచయం.. ఆపై యువతికి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.