రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థలతోపాటు కల్యాణదుర్గం, మచిలీపట్నం, మైదుకూరు, పలాస-కాశీబుగ్గ, పులివెందుల పురపాలక సంఘాలు కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు. పని చేస్తున్న ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్) సకాలంలో జమ చేయనందున వాటిపై వడ్డీ, పరిహారం కింద రూ.16.18 కోట్లు చెల్లించాల్సి వచ్చినట్లు కాగ్ గుర్తించింది. ఈమేరకు 2020 నివేదికలో వివరాలను వెల్లడించింది.
ఉద్యోగులు, కార్మికుల వేతనాల నుంచి మినహాయించే ఈపీఎఫ్ మొత్తానికి యాజమాన్యం వంతు కలిపి మాసాంతం నుంచి 15 రోజుల్లోగా భవిష్య నిధికి జమ చేయాలి. అయితే రెండు నగరపాలక సంస్థలు, మరో ఐదు పురపాలక సంఘాలు 2008 జూన్-2018 ఆగస్టు మధ్య, 2018 ఏప్రిల్, 2019 మార్చిలో ఒప్పంద ఉద్యోగుల నుంచి మినహాయించిన మొత్తాలను 2 నుంచి 1,849 రోజుల ఆలస్యంగా జమ చేశాయి. ఈ జాప్యానికి ఆ సంస్థలపై ఈపీఎఫ్‌వో జరిమానా విధించింది. ఇందులో గతేడాది రూ.8.12కోట్లు చెల్లించాయని కాగ్ వెల్లడించింది.
ఇవీ చూడండి: