pm modi mp vijayasai reddy: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం ఆయన ప్రధానిని కలిశారు.
- రాష్ట్రంలోని జల మార్గాల్లో నౌకా విహార పర్యాటకం, అందుకు అవసరమైన మౌలిక వసతులకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పథకంలో కేంద్ర సహాయం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్గో టెర్మినల్ నిర్మాణానికి రూ.38.50 కోట్లు, స్వదేశీ దర్శన్ కింద కోస్టల్ సర్క్యూట్‌లో కాకినాడ- హోప్ ఐలాండ్- కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం- పాశర్లపుడి- ఆదూరు- ఎస్.యానాం- కోటిపల్లికి రూ.67.84 కోట్లు, నెల్లూరు- పులికాట్ సరస్సు- ఉబ్బలమడుగు జలపాతం- నేలపట్టు- కొత్తకోడూరు- మైపాడు- రామతీర్థం- ఇస్కపల్లి తీరాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.49.55 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ టెర్మినల్ బెర్తు, టెర్మినల్ భవన నిర్మాణానికి రూ.96.05 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:
Lance Naik Sai Teja Death: నేడు స్వగ్రామానికి సాయితేజ మృతదేహం!