పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర జల శక్తి శాఖ అసంతృప్తితో ఉందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్లుగా పోలవరం టెండర్లు పిలిచారని ఆరోపించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... రెవెన్యూ లోటు సహా ఇతర విషయాల్లో గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై ఇంకా దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు.
కేంద్ర సాయం ఎక్కువే
గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికి అందనంత ఎక్కువ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందని సుజనాచౌదరి అన్నారు. విభజన హామీల సాధన కోసం 22 మంది వైకాపా ఎంపీలు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. తెదేపా అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ఉనికి లేని పార్టీతో స్నేహం, ఉనికి ఉన్న పార్టీతో యుద్ధం చేసి... వైకాపాకు ఎర్ర తివాచీ పరిచారని ఎద్దేవా చేశారు. 2023 నాటికి జమిలి ఎన్నికలు ఖాయమని.. అప్పుడు జాతీయవాదం - ప్రాంతీయ వాదం మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఈలోపు భారతీయ జనతా పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందనే ఆశాభావాన్ని సుజనాచౌదరి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: