రాజధానిగా అమరావతి కొనసాగిస్తామని చెప్పి.. తడిగుడ్డతో గొంతులు ఎలా కోస్తారో కళ్లారా చూపించారని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. నవరత్నాలు అని పచ్చి అబద్ధమాడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులు 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చంద్రబాబు పిలుపుతో రైతులు భూములిస్తే.. ఒక సామాజిక వర్గానికి చెందినవనే నెపంతో రాజధానిని మార్చాలని కుట్ర చేశారన్నారు.
సీఎం జగన్ ఒక భ్రమలో ఉండి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం నీచమని రఘురామ ధ్వజమెత్తారు. తాకట్టు పెట్టడానికి పనికొచ్చే అమరావతి భూములు.. రాజధానికి మాత్రం పనికి రావా ? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్‌కి మాట్లాడే హక్కు ఉందా ? అని ప్రశ్నించిన రఘురామ.. స్టీల్ ప్లాంట్ అమ్మితే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళతారనే వార్తలు వస్తున్నాయని..,అలా జరిగితే రాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాలకు లోను కాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి
farmers deeksha.. live updates: వెలగపూడిలో రైతుల 24 గంటల నిరాహార దీక్ష