ETV Bharat / city

ఆదాయాన్ని ఖజానాలో జమచేయకుండా.. కార్పొరేషన్​కు మళ్లించడం చట్టవిరుద్ధం:ఎంపీ రఘురామ - లోక్​సభలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

MP RRR: మద్యంపై వచ్చే ఆదాయాన్ని.. ఖజానాలో జమచేయకుండా కార్పొరేషన్​కు మళ్లించడం చట్టవిరుద్ధమని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఇదే అంశాన్ని ఆయన లోక్​సభలో ప్రస్తావించారు.

MP RRR
MP RRR
author img

By

Published : Jul 21, 2022, 2:09 PM IST

MP RRR: మద్యం ఆదాయాన్ని కార్పొరేషన్​కు మళ్లిస్తున్నారనే అంశాన్ని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్​సభలో లేవనెత్తారు. ఖజానాలో జమ చేయాల్సిన సొమ్ములను కార్పొరేషన్​కు మళ్లించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని కేంద్రం చెప్పిన వేళ.. ఇలాంటి చర్యలపై దృష్టి సారించాలని కోరారు. రఘురామ మాట్లాడుతున్న సమయంలో వైకాపా ఎంపీ భరత్ సహా మిగిలిన సభ్యులు అడ్డుతగిలారు. ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో భరత్, రఘురామరాజు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆదాయాన్ని ఖజానాలో జమచేయకుండా.. కార్పొరేషన్​కు మళ్లించడం చట్టవిరుద్ధం:ఎంపీ రఘురామ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.