ETV Bharat / city

భర్త మరణం తరువాత మాతృత్వం!.. ఎలాగో తెలుసా?

పెళ్లైన నాటి నుంచి దంపతులు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులం అవుతామా.. ఎప్పుడెప్పుడు అమ్మా నాన్న అని పిలిపించుకుంటామా అని ఆశగా ఎదురుచుస్తుంటారు. కానీ ఈ ఆశా అందరికీ అంత సులువుగా నెరవేరదు. కొందరు ఏళ్ల తరబడి మాతృత్వ మధురానుభూతి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. తల్లి కావాలని తపించిన ఓ మహిళ.. భర్త మరణించిన 11 నెలలకు ఆధునిక వైద్య విధానంతో మాతృత్వాన్ని పొందింది.

Motherhood after husband's death in manchirial district

author img

By

Published : Apr 8, 2022, 5:51 AM IST

తల్లి కావాలని తపించిన ఓ మహిళ.. భర్త మరణించిన 11 నెలలకు ఆధునిక వైద్య విధానంతో మాతృత్వాన్ని పొందింది. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు ఏడేళ్లయినా పిల్లలు పుట్టలేదు. వీరు వరంగల్‌లోని ఒయాసిస్‌ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. కరోనాతో 2021లో భర్త చనిపోయారు. పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే జీవిత భాగస్వామి మరణించడంతో 32 ఏళ్ల ఆ మహిళ కుంగిపోయారు. మరోపెళ్లి చేసుకోకుండా అత్తమామలతో ఉంటున్నారు.

ఆసుపత్రిలో భద్రపరచిన భర్త వీర్యం ద్వారా బిడ్డను కని మాతృత్వపు మధురిమలను చవిచూడాలని భావించారు. అదే విషయాన్ని అత్తమామలకు వివరించారు. వారి అంగీకారంతో వైద్యనిపుణులను సంప్రదించారు. న్యాయపర ఇబ్బందులు ఎదురవకుండా ఆమె హైకోర్టుకు వెళ్లారు. కోర్టు సైతం యువతి ఇష్టానికి వదిలేయడంతో దంపతుల నుంచి సేకరించి భద్రపరచిన వీర్యం, అండాల ద్వారా ఆగస్టు 2021లో ఆసుపత్రి నిపుణులు ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. అది సఫలం కావడంతో ఈ ఏడాది మార్చి 22న పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. ఆసుపత్రి క్లినికల్‌ హెడ్‌ డాక్టర్‌ జలగం కావ్యారావు మాట్లాడుతూ 16 రోజుల బాబును చూపిస్తూ తల్లి కావాలన్న ఆ స్త్రీ పడిన తపన, ఆమెకు అండగా నిలిచిన అత్తమామల గొప్పతనాన్నివివరించారు.

ఇదీ చదవండి:టార్చిలైట్ల వెలుగులో ప్రసవం... పసికందు సైతం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.