Modi Enemy Of Telangana: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై.. ఆ రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. తెరాస, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. తెరాస మద్దతుదారులు 'మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ' పేరుతో ట్వీటర్‌లో పెట్టిన హ్యాష్‌టాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తెరాస మద్దతుదారులు గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉన్నాయి. రాజకీయాంశాల్లో తొలిస్థానంలో నిలిచాయి.
నిరసనలు..
ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నిరసన తెలపాలంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలు రోడ్డెక్కారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనాలు చేస్తూ నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని నేతలు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?