ETV Bharat / city

Camera in bathroom : జూబ్లీహిల్స్​లో దారుణం... మహిళల బాత్​రూమ్​లో కెమెరా - camera in bathroom at restaurant

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో ఓ ఫుడ్​కోర్టులోని బాత్​రూమ్(Camera in bathroom)​లో కెమెరా ఆన్​చేసిన సెల్​ఫోన్ ఉండటం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి రెస్టారెంట్​కు వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడ కెమెరా ఆన్​చేసిన మొబైల్ ఉండటం గమనించి ఖంగుతిన్నది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళల బాత్​రూమ్​లో కెమెరా
మహిళల బాత్​రూమ్​లో కెమెరా
author img

By

Published : Sep 23, 2021, 12:27 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్‌(Camera in bathroom)లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. ఫుడ్​కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడి బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్‌ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌ క్లీనర్‌ బెనర్జీ ఫోన్‌ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.