వైకాపా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని విస్మరించిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. నియామకాలు లేక నిరుద్యోగ యువత ఆవేదన చెందుతున్నారని అన్నారు. తక్షణమే నియామకాలు చేపట్టాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మీడియా సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడారు.
ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు వెంటనే టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఎపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకటించి గ్రూపు 1, 2, 3, 4 నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. లైబ్రరీ, వ్యాయామ ఉపాధ్యాయ, విద్యుత్ శాఖ , పారా మెడికల్ తదితర పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలన్నారు.
ఇదీ చదవండి: వెటర్నరీ ఆసుపత్రి చెట్టుకింద ఒంగోలు ఎద్దు..!