అంతర్వేది ఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కుట్ర అని వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిందని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో చెప్పారు. ముఖ్యమంత్రికి ఒక మతాన్ని ఆపాదించేందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ఆర్ ఆసరాతో రాష్ట్రంలోని మహిళలు లక్షాధికారులు కాబోతున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక