ETV Bharat / city

'అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం' - visakha latest news

తెదేపాపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్​కు చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు.

MLA Gudiwada Amarnath fires on chandrababu over 3 capitals issue
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
author img

By

Published : Aug 28, 2020, 8:37 AM IST

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. ఆ ఉద్దేశంతోనే మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేయబోతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో జరగడం వల్ల మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 3 రాజధానులపై తెదేపా కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు.

పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రయత్నాలను తెదేపా అడ్డుకుంటున్నారని అమర్నాథ్​ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోనే తెదేపాను ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. కరోనాను సీఎం జగన్ సమర్ధంగా ఎదుర్కొంటుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారతదేశ చరిత్రలో తక్కువ కాలంలో 60 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తూ... సీఎం జగన్ అందరు ఆదర్శంగా నిలబడ్డారని కొనియాడారు.

ఇదీ చదవండీ... రామోజీ ఫిల్మ్‌ సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.