ETV Bharat / city

'జగన్ దిల్లీలో ఔనంటారు.... గల్లీలో కాదంటారు' - చంద్రబాబుతో ముస్లిం సంఘాలు భేటీ

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్) విషయంలో వైకాపా సర్కార్​ తీరుపై ముస్లిం సంఘాల నేతలు మండిపడ్డారు. ఎన్పీఆర్​పై ప్రజల్లో భయాందోళనల దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రస్తుతానికి అభయన్స్​(పెండింగ్​)లో పెట్టడానికి కేబినెట్​ భేటీలో ఆమోదం కూడా జగన్నాటకమే అన్నారు. సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు నెలలో జీవో 102ను విడుదల చేసేవారు కాదని విమర్శించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Mar 5, 2020, 6:25 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ముస్లింల ఓట్ల కోసం జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. దిల్లీలో ఒకలా గల్లీలో మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వారు తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిశారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ) అమలుపై దేశవ్యాప్తంగా అల్పసంఖ్యాక వర్గాలంతా భయాందోళనల్లో ఉన్నారని, వీటి అమలుపై రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఎన్​పీఆర్​పై ప్రజల్లో భయాందోళనల దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రస్తుతానికి అభయన్స్​(పెండింగ్​)లో పెట్టడానికి కేబినెట్​ భేటీలో ఆమోదం కూడా జగన్నాటకమే అన్నారు. సీఎం జగన్​కు చిత్తశుద్ది ఉంటే ఆగస్టు నెలలో జీవో 102ను విడుదల చేసేవారు కాదని అన్నారు. అప్పుడు జీవో ఇచ్చి ఇప్పుడు అభయన్స్ అంటే నమ్మడానికి ముస్లింలు సిద్ధంగా లేరని తెలిపారు. తాము చేస్తున్న ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ పరంగా సహకారం అందించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.... ముస్లింల హక్కుల పరిరక్షణకు తెలుగుదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలుపుదల చేస్తూ కేబినెట్​ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.