పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాన్ని జీర్ణించుకోలేకే... కొందరు విమర్శలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఎంత మంది విమర్శించినా ప్రజాప్రయోజనాల రీత్యా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగైదు నెలల్లో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 1 లక్షా 80 వేల మంది ఉపాధ్యాయుల్లో తొలుత 68 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇఫ్లూ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇంగ్లీష్ బోధన విషయంలో మతపరమైన కోణాన్ని చూపించటం దారుణమని అన్నారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించొద్దా.. అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: