Minister Roja meets CM KCR: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆర్కే రోజా ప్రగతిభవన్‌కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి హోదాలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. సీఎంతో పలు అంశాలపై చర్చించారు. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు.. కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టకముందు.. ఈ నెల 1 న యాదాద్రిని సందర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ముడుపు కట్టారు. పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి వైభవాన్ని చూసి ఆమె తన్మయత్వం పొందారు. ఆలయ ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవని.. యాదాద్రి పునర్నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తిరుమలతో సమానంగా యాదగిరిగుట్టను పునర్నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 13న రోజా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
ఇవీ చదవండి:
kTR Vs AP Ministers: ఏపీ మంత్రులు వర్సెస్ కేటీఆర్
ఏపీలో కరెంటు, నీళ్లు లేవు.. క్రెడాయ్ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్