ETV Bharat / city

"ఇలాగైతే పార్టీలో ఉండటం కష్టం.. " మంత్రి రోజా ఆడియో వైరల్ - ap viral news

ROJA AUDIO MESSAGE VIRAL : నగరిలో వైకాపా పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీలో అంతర్గత పోరుపై మంత్రి రోజా ఆడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే?

ROJA AUDIO MESSAGE VIRAL
ROJA AUDIO MESSAGE VIRAL
author img

By

Published : Oct 18, 2022, 1:18 PM IST

MINISTER ROJA AUDIO VIRAL : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైకాపాలో వర్గ పోరు మరోమారు బహిర్గతమైంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక మంత్రి రోజా.. పార్టీలో సీనియర్ నాయకుడు, ప్రస్తుత శ్రీశైల దేవస్థానం ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డితో పాటు నియోజకవర్గంలో పలువురు కీలక నేతలను దూరంగా పెట్టారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గత మూడున్నరేళ్లుగా వీరి మధ్య వర్గపోరు నడుస్తోంది.

ఈ క్రమంలో ఆదివారం నిండ్ర మండలం కొప్పెడులో ఆర్‌బీకే, వెల్‌నెస్‌ కేంద్రానికి.. మంత్రి రోజాని ఆహ్వానించకుండానే, చక్రపాణి రెడ్డి, కేజే శాంతి భూమి పూజ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మంత్రి రోజా.. పార్టీలో ఉంటూ తనను నిత్యం వేధిస్తున్నారని ఇలాగైతే పార్టీలో ఉండడం కష్టమంటూ ఆడియోని విడుదల చేశారు. జనసేన పార్టీ నవ్వుకునే విధంగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని.. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వైరల్​ అవుతున్న మంత్రి రోజా ఆడియో సందేశం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.