ETV Bharat / city

TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు.. దేనికి ఎంతంటే! - ఆర్టీసీ ఛార్జీల పెంపు

తెలంగాణలో ఆర్టీసీ(TSRTC) ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​ సమీక్ష నిర్వహించారు. ఛార్జీల పెంపుపై అధికారులు సమాలోచనలు జరిపి పలు ప్రతిపాదనలు రూపొందించారు.

TSRTC
TSRTC
author img

By

Published : Nov 7, 2021, 3:34 PM IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు..

తెలంగాణలో ఆర్టీసీ(TSRTC) ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు సమాలోచనలు జరిపి పలు ప్రతిపాదనలు రూపొందించారు.

పల్లె వెలుగుకు కి.మీ.కు 25పైసలు, ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేశారు. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదింంచారు. సీఎం కేసీఆర్‌ పరిశీలన తర్వాతే ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​ తెలిపారు.

రెండు నెలల క్రితమే.. సీఎం వద్ద ఛార్జీల వద్ద ప్రతిపాదన తెచ్చాం. ఛార్జీలు పెంచినా ఆర్టీసీ నష్టాల బారి నుంచి గట్టెక్కడం కష్టమే. కానీ పెంపు తప్పదు. సమాలోచనలు జరిపి.. ఒక్కో సర్వీసుపై పలు ఛార్జీలు ప్రతిపాదించాం. సీఎం కేసీఆర్​ ఈ నివేదికలు పరిశీలించిన తర్వాతనే.. నిర్ణయం తీసుకుంటాం. -బాజిరెడ్డి గోవర్దన్​, టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​

చమురు ధరలు తగ్గినా

తెలంగాణ ఆర్టీసీ(TSRTC)పై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్​ను కోరారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కూడా పూర్తి కావడంతో ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశముందని అధికారులు అంటున్నారు. కేంద్రం డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించడంతో.. రోజుకు 65 లక్షల రూపాయలు ఆదా అవుతోంది. దీంతో ఆర్టీసీకి కొంత ఉపశమనం లభించినా.. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెంపుపై 3, 4 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వాటిపై ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించి... తదుపరి సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపైనా తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

ఇదీ చదవండి:

amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.