ETV Bharat / city

అరెస్టులకు ఆధారాలున్నాయి.. చర్చకు సిద్ధమా?: పేర్ని నాని - జేసీ ప్రభాకర్ అరెస్టు

నేతల అరెస్టులపై ఆరోపణలు చేస్తున్న తెదేపా.. మీడియా సమక్షంలో చర్చకు రావాలని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. చర్చకు వస్తే ఆ నేతల అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. జేసీ ట్రావెల్స్ నకిలీ పత్రాలతో లారీల రిజిస్ట్రేషన్, నకిలీ ఎన్​ఓసీలు సృష్టించడం వంటి మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. లారీలను బస్సులుగా మార్చి నడిపారని ఆక్షేపించారు.

మంత్రి పేర్ని నాని
మంత్రి పేర్ని నాని
author img

By

Published : Jun 13, 2020, 3:25 PM IST

అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న తెదేపా నేతలు.. చర్చకు సిద్ధమా అని మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. చర్చకు వస్తే ఆధారాలతో సహా అవినీతిని నిరూపిస్తామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. 2018లో నకిలీ దస్త్రాలతో 98 లారీల ఛాసిస్‌లు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు.

అనంతపురంలో 29, కర్నూలు జిల్లాలో 3 లారీలకు రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆయన.. లారీలు రిజిస్ట్రేషన్‌ చేయడమే తప్పయితే వాటిని బస్సులుగా మార్చి తిప్పారని ఆరోపించారు. నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించినందుకు జేసీ ట్రావెల్స్​పై కేసులు నమోదయ్యాయన్నారు. 101 నిషేధిత లారీల్లో 97కు రిజిస్ట్రేషన్‌ రద్దయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. లారీలను బస్సులుగా మార్చిన మూడింటిని అధికారులు సీజ్‌ చేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే కేసులా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.