నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. 800 కోట్ల రూపాయల్ని కేంద్రం మంజూరు చేసిందని... వీటిని సకాలంలో వినియోగించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో వేసవిలో తాగునీటి ఎద్దడిపై మంత్రి సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
వేసవిలో ఎక్కడా మంచినీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జల్ జీవన్ మిషన్ పనుల్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు