'చంద్రబాబు పర్యటనకు ప్రజాదరణ లేదు' - చంద్రబాబు పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రజాదరణ లేదని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు కాదని విమర్శించారు. వైకాపా కార్యకర్తలపై అవాకులు చవాకులు పేల్చుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉత్తుత్తి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆక్షేపించారు.