ETV Bharat / city

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది: కిషన్‌రెడ్డి - corona latest update in telangana

దిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ను... కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి కలిశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించినట్లు చెప్పారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నారు.

minister-of-state-for-union-home-ministry-kishan-reddy-on-corona-in-telanagna
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
author img

By

Published : Jul 8, 2020, 5:39 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. దిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలిశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించారు. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు.

అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కేంద్రం బృందాన్ని పంపించామని గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తెలంగాణకు అన్ని విధాలా సహాయం చేస్తామని కేంద్రమంత్రి హర్షవర్దన్‌ చెప్పారన్నారు. లాక్‌డౌన్‌, కంటైన్‌మెంట్ల జోన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అవసరమైన వైద్య బృందాలను పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖమంత్రి చెప్పారని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 2.45 లక్షల పీపీఈ కిట్లను రాష్ట్రానికి పంపిందని.. రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరతను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తెలంగాణకు 1,220 వెంటిలేటర్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారని వివరించారు.

ఇదీ చదవండి : ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.