పన్నుల పెంపు లేకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు . దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్రం సహేతుకమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ రేట్లు, సెస్సులపైనా రాష్ట్రప్రభుత్వం తరఫున పలు సూచనలిచ్చారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే మార్గాలు, పన్ను రేట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి: