ETV Bharat / city

Tweet to KTR: 31 నిమిషాలు పార్కింగ్​ చేస్తే.. రూ. 500 వసూలు.. ఇక ప్రైవేటీకరణ చేస్తే..! - ktr news

రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ముందే కనిపిస్తున్నాయని ట్విట్టర్​ ద్వారా ఓ వ్యక్తి ఆరోపించారు. కారు పార్కింగ్​ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్​కు ఆ వ్యక్తి ట్విట్టర్ ద్వారా​ తెలియజేశారు. అదేంటంటే..

tweet to ktr
tweet to ktr
author img

By

Published : Nov 10, 2021, 6:09 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో 31 నిమిషాలు కారు పార్కింగ్ చేసినందుకు తన నుంచి భారీగా ఫీజు వసూలు చేశారని ఓ వ్యక్తి ఆరోపించారు. 31 నిమిషాల పార్కింగ్​కు రూ. 500 పార్కింగ్ ఫీజు వసూలు చేశారని మండిపడ్డారు. ఇంత భారీగా పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో బ్రిగేడియర్ జైరత్ అనే ప్రయాణికుడు తెలంగాణ మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. ఇక రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటుందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ ట్వీట్​కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇది నిజంగా దారుణం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ స్పందించాలని ఆయనకు రీ ట్వీట్ చేశారు. పౌరులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Manchirevula case: పేకాట కేసు.. హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.