-
I may just exit social media if that happens https://t.co/nFApCP7BMq
— KTR (@KTRTRS) May 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I may just exit social media if that happens https://t.co/nFApCP7BMq
— KTR (@KTRTRS) May 25, 2021I may just exit social media if that happens https://t.co/nFApCP7BMq
— KTR (@KTRTRS) May 25, 2021
దేశంలో ట్విటర్‌ను నిషేధిస్తే తాను వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగుతానని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ట్విటర్‌ను నిషేధిస్తే మీరు ఏ సామాజిక మాధ్యమాన్ని ఎంచుకుంటారని బుధవారం ఒక నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించగా ట్విటర్‌లో ఆయన ఈ సమాధానం తెలిపారు.
హనీవెల్‌కు కృతజ్ఞతలు
తెలంగాణకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, ఎన్95, మాస్క్‌లు, పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చిన హనీవెల్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక కార్పొరేటు బాధ్యత కింద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.
28 అంకురాలకు ప్రోత్సాహం
తెలంగాణలో వినూత్న ఆవిష్కరణలు జరిపిన 28 అంకుర సంస్థలను రూ. రూ. 90 లక్షల మేరకు ప్రోత్సాహక ఆర్థిక సాయాన్ని అందించినట్లు రాష్ట్ర ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ) తెలిపింది. సాయం కోసం అంకుర సంస్థలు ఈ నెలాఖరు వరకు స్టార్టప్.తెలంగాణ.జీవోవీ. ఇన్‌కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఐసీ సూచించింది.
ఇదీ చూడండి: