రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ఐటీ మంత్రి గౌతంరెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకున్నామని...రూ.1168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చామని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు నెమ్మదించాయని గుర్తు చేశారు. పరిశ్రమల వెసులుబాటుకు రూ.188 కోట్ల విద్యుత్ స్థిర ఛార్జీలు మాఫీ చేశామని చెప్పారు. కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. కీలక రంగాలతో ఆర్థిక బలోపేతానికి మార్గాలు అన్వేషిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి