సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠి కోసం బ్యాంకు గ్యారంటీ ద్వారా సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని 200కోట్లు పెట్టుబడి సాయం అందించే ఏర్పాటు చేసినట్టు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. బియాండ్ లాక్డౌన్ పేరిట అసోఛామ్ నిర్వహించిన వెబ్ నార్ కార్యక్రమానికి మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు.
"కరోనా నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త అవకాశాలు" అనే అంశంపై వినూత్న ఆలోచనలను వెబ్ నార్లో మంత్రి పంచుకున్నారు. ఈ వెబ్ నార్ కు హర్యానా ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాల, ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ఈ, విద్యుత్ శాఖ మంత్రి డి.శంకర్ మిశ్రా, హర్యానా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అపూర్వకుమార్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అస్సామ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కె.కె.ద్వివేది, అసోచామ్ ప్రతినిధులు హాజరయ్యారు.