ఆర్థిక లక్ష్యాల సాధనలో ఏపీ వాటా పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా ఏపీ కూడా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ సలహాదారులు, కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ 15 రోజులకు రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై సమీక్షి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన లక్ష్యం ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయటంతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుతామన్నారు.
ఇదీ చదవండి :