దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యాతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జరిగిన భేటీలో రైల్వే ఉన్నతాధికారులు(railway offficers) పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన నిధులు పెండింగ్లో ఉండటం వల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడం ఆలస్యమవుతున్నాయని,.. నిధులు వస్తేనే ప్రాజెక్టులు చేపడతామని ఇటీవల రైల్వే జీఎం స్పష్టం చేశారు.
ఇదీచదవండి.