కరోనా మూడో వేవ్ లేకుంటే పర్యాటక ఉత్సవాలు నిర్వహించేవాళ్లమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గతంలో అరకు ఫెస్టివల్, ఇతర ఉత్సవాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఆలయాలు, అటవీ ప్రాంతాల్లో పర్యాటక ప్యాకేజీలు ప్రవేశపెడతామన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్యాకేజీలు రూపొందిస్తామన్నారు. విశాఖ బీచ్, గోదావరి నదిలో పర్యాటకం ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 13 జిల్లాలను రాయలసీమ, విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర సర్క్యూట్‌లుగా విభజిస్తామన్నారు. పర్యాటకం కోసం పోలవరం వద్ద కూడా ప్రభుత్వం స్థలం ఇచ్చిందని పేర్కొన్నారు. పోలవరం వద్ద పడవలు కూడా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి అన్నారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ.4 కోట్లు కేటాయించినట్లు మంత్రి అవంతి తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో స్టేడియాలు నిర్మిస్తామన్నారు.రాష్ట్రంలో 15 చోట్ల స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 3 చోట్ల అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానం నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కరోనాతో ఆగిన పర్యాటక, క్రీడా, యువజన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: