ETV Bharat / city

Minister Ambati : పీపీఏ లేఖ నిజమే.. సమాధానమిస్తాం: మంత్రి అంబటి - పీపీఏ లేఖపై మంత్రి అంబటి

Minister Ambati on PPA letter: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనుల జాప్యంపై పీపీఏ లేఖ రాసిన మాట నిజమేనని... జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలోనే సమాధానం ఇస్తామన్నారు. సీజన్ కంటే ముందుగా వచ్చిన ఆకస్మిక వరదలతో పనులు నిలిచిపోయాయని... ఇందులో ప్రభుత్వం చేసిన తప్పేంటని అంబటి ప్రశ్నించారు.

Minister Ambati on PPA letter
మంత్రి అంబటి
author img

By

Published : Aug 11, 2022, 9:52 AM IST

Minister Ambati on PPA letter: దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై నెలాఖరులోగా పూర్తి చేయకపోవడంతో నష్టం జరిగిందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) జులై 22న రాసిన లేఖలో పేర్కొన్నది వాస్తవమేనని రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారు. వరదల కారణంగానే పనులు పూర్తి చేయలేకపోయామంటూ వారికి సమాధానమివ్వబోతున్నామన్నారు. పోలవరం పనులకు సంబంధించి ఇటీవల రూ.453 కోట్లు అదనంగా ఇచ్చిన విషయమై విజయవాడలో విలేకరులు ప్రశ్నించగా.. తర్వాత చెబుతామని సమాధానమిచ్చారు.

మంత్రి అంబటి

‘జులై 31నాటికి దిగువ కాఫర్‌డ్యాం పనులు పూర్తి చేయాలని పీపీఏ చెప్పింది. డిజైన్లు ఏప్రిల్‌లో ఇచ్చారు. ఇందులో వారి తప్పేమీ లేదు. అక్కడ భయంకరమైన గుంతలు ఏర్పడటంతో జియోబ్యాగ్స్‌తో జెట్‌ గ్రౌటింగ్‌ చేయమని చెప్పారు. అయితే ఎవరూ ఊహించనట్టుగా జులై 8న వరదలు మొదలుకావడంతో 9, 10వ తేదీలనుంచి పనులకు ఆటంకమేర్పడింది. వరదలు రావడం, మునిగిపోవడం నిజం కాదా?’ అని అంబటి ప్రశ్నించారు. ‘డయాఫ్రంవాల్‌ ఆరోగ్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద గుంతలు పూడ్చలేక, సాంకేతికత అర్థం కాక చస్తున్నాం’ అని వివరించారు. ‘ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రంవాల్‌ కట్టడమే దీనంతటికీ కారణం. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

సీఎంకు గాలి జనార్దన్‌రెడ్డి ముఖ్యమన్నట్లు చిత్రీకరణ: ముఖ్యమంత్రి జగన్‌కు గాలి జనార్దన్‌రెడ్డి ఎంతో ముఖ్యమనేట్టుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రాంబాబు విమర్శించారు. ‘కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వివాదం తేలడంతో తవ్వకాలకు అనుమతివ్వాలని ఓబులాపురం సంస్థ సుప్రీంకోర్టును కోరింది. వివాదం తేలినందున తవ్వకాలకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ ఇచ్చింది. ఇది చాలా పెద్ద తప్పు.. నేరంగా చూపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.