రెండవ విడత మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రెండవ విడత నాడు నేడు కార్యక్రమం ద్వారా 16,345 విద్యాసంస్థల్లో మౌళిక వసతులు, ఇందులో 473 జూనియర్ కళాశాలలు ఉన్నయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పని కళాశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరగాలన్నారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పారు. ఏ అధికారి అధీనంలో ఏ పనులు చేపట్టాలి, ఎవరు ఏ అధికారాలు కలిగి ఉంటారో అవగాహన కలిగి పనులు చేపట్టి సకాలంలో ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: