ETV Bharat / city

నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు..!

author img

By

Published : Apr 30, 2020, 4:51 PM IST

Updated : Apr 30, 2020, 7:47 PM IST

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బృందాలను పంపాలని కేంద్ర హోంశాఖ యోచిస్తుంది. ఇవాళో, రేపో ఏపీలో కేంద్రం బృందాలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు!
నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు!

దేశంలో కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు మరికొన్ని కేంద్ర బృందాలు పంపాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటివరకూ పశ్చిమ బంగా, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందాలను పంపిన కేంద్రం... ఈ ఆరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారాన్ని హోం మంత్రిత్వ శాఖకు పంపడంతోపాటు.. కరోనా నియంత్రణకు స్థానిక అధికారులకు సలహాలు ఇస్తున్నాయి. ఇదే తరహాలో కరోనా ప్రభావం పెరుగుతున్న మిగిలిన రాష్ట్రాలకు కూడా కేంద్ర బృందాలు పంపనున్నట్లు తెలిసింది.

దీనిలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కూ కేంద్ర అధికారుల కమిటిని పంపనున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్​లో టెస్టులు పెంచుతుండటం.. దానికి అనుగుణంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అధికారుల బృందాన్ని పంపాలని హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు సహా ప్రభావం పెరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కేంద్ర అధికారుల కమిటి పర్యటించే అవకాశాలు ఉన్నాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే కమిటి తన పర్యటన ప్రారంభిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్ధుల, పర్యాటకులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ మేరకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలని, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు, లారీలు, ట్రక్కులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు.

ఇదీ చదవండి : 'రాష్ట్రానికి వచ్చేలోపు చనిపోయేలా ఉన్నాం'

Last Updated : Apr 30, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.