పీజీ వైద్య విద్య కళాశాలలో చేరేందుకు వెళ్తే ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతించడం లేదంటూ వి.మహేశ్ అనే విద్యార్థి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో సీటు పొందానని, తాను చెల్లించే రుసుమును స్వీకరించి ప్రవేశం కల్పించేలా ఆదేశించాలని కోరారు.
జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి , జస్టిస్ కె లలితతో కూడిన ధర్మాసనం విచారణను ఈనెల 18 కి వాయిదా వేసింది. మరో నాలుగు వైద్య కళాశాలలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 28 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు .
ఇదీ చదవండి: