తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు సచివాలయ ప్రాంతాన్ని చూపనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కూల్చివేత సంబంధిత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అయితే, కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని.. తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ సాయంత్రం బీఆర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్లి సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపించనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: రికవరీలో రికార్డు- ఒక్కరోజే 36 వేల మంది డిశ్చార్జ్