ETV Bharat / city

ఎంత అత్యవసరమైన పని అయినా.. సరిహద్దుల్లో తప్పని తిప్పలు!

తెలంగాణలో లాక్​డౌన్​ అమలు కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు.. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెళ్లికి వస్తున్న వారిని పోలీసులు అనుమతించలేదు. గంటసేపు బతిమిలాడిన అనంతరం వారిని అనుమతించారు.

problem to passengers at borders in wake of lockdown
సరిహద్దుల్లో తప్పని తిప్పలు
author img

By

Published : May 12, 2021, 8:03 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని రామాపురం క్రాస్​రోడ్ వద్ద చెక్​పోస్ట్ మూసివేసిన కారణంగా... ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో లాక్​డౌన్​ నిబంధనల దృష్ట్యా ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెళ్లికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కారణంగా.. రాష్ట్రానికి చెందిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు.

అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకున్న అనుమతి పత్రం చూపించినా.. పోలీసులు నిరాకరించారని బంధువులు వాపోతున్నారు. గంటసేపు ఎండలో బతిమిలాడుతూ తీవ్ర ఇబ్బందులు పడిన తర్వాత ఎట్టకేలకు పెళ్లికి వెళ్లడానికి పోలీసులు అంగీకరించారు.

ఇవీ చదవండి:

ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం.. నేడే నోటిఫికేషన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.