కుయ్, కుయ్, కుయ్ అంటాయని తెచ్చిన అంబులెన్స్‌లు కుయ్యో, మొర్రో అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వచ్చిందని అంటూ నిలదీశారు. అవినీతి కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టుచేశారు.
అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో ప్రధానోపాధ్యాయుడు నారాయణస్వామి అస్వస్థతకు గురై నడిరోడ్డుపై పడిపోగా స్థానికులు 108కి కాల్ చేశారన్నారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారని లోకేశ్ తెలిపారు. సీఎం జగన్ కు ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణమని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
'ప్రమాదాలు జరుగుతున్నా.. కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది'