ETV Bharat / city

హైదరాబాద్ నుంచే లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలు - govt order on lokayuktha activities

రాష్ట్రంలో ఏర్పాటైన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు ప్రస్తుతానికి హైదరాబాద్​ నుంచే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఈ రెండు కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇలాగే కొనసాగుతాయని సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

లోకాయుక్త కార్యకలాపాలు
author img

By

Published : Sep 27, 2019, 11:57 PM IST

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచే పని చేస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. విజయవాడలో ఈ రెండు కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నందున తాత్కాలికంగా అక్కడి నుంచే పని చేస్తాయని తెలిపింది. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని లోకాయుక్త సంస్థ​ నుంచే అధికారులు విధులు నిర్వహిస్తారని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవలే ఏపీ లోకాయుక్తగా జస్టిస్​ లక్ష్మణ్​రెడ్డి నియమితులయ్యారు.

ఇదీ చూడండి :

ఒప్పంద, పొరుగు సేవల నియామకాలపై కమిటీ

Intro:ap_cdp_17_27_road_accident_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప కోటిరెడ్డి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కడప వివేకానంద నగర్ కు చెందిన రామచంద్రారెడ్డి పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. కోటిరెడ్డి కూడలి సమీపంలో ఆటో ల కోసం ప్రత్యేకంగా వేసిన ఇనుప బారికేడ్లను తగలడంతో కిందపడ్డాడు. అదే సమయానికి అటు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:రోడ్డు ప్రమాదంలో మృతి

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.