ETV Bharat / city

తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ - తెలంగాణలో లాక్​డౌన్ పొడిగింపు

తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌
తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌
author img

By

Published : May 18, 2021, 8:45 PM IST

Updated : May 18, 2021, 9:26 PM IST

20:42 May 18

LOCK DOWN

తెలంగాణలో అమల్లో ఉన్న లాక్​డౌన్​ను ఈనెల 30వ తేదీ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి.. వారి అభిప్రాయాలను సీఎం కేసీఆర్  తెలుసుకున్నారు. మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సీఎం కేసీఆర్ లాక్​డౌన్​ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.  

ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన కేబినెట్ భేటీని సీఎం రద్దు చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు

Last Updated : May 18, 2021, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.