తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రామాయంపేటలో దొంగలు హల్చల్ చేశారు. ఓ వైన్స్ షట్టర్ తాళాలు పగులగొట్టి, ఇద్దరు దొంగలు లోపలికి చొరబడి ఓ ల్యాప్టాప్, మద్యం సీసాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
సుమారు ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు దొంగలు బైక్పై వచ్చి రామాయంపేటలోని.. భువనేశ్వరి వైన్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి సీసీ కెమెరాలని ధ్వంసం చేశారు. మొత్తం 50 వేల వరకు సొత్తు చోరీ అయిందని వైన్స్ యజమాని రమేష్ పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :