ETV Bharat / city

తానా ఆధ్వర్యంలో తారలు - రాతలు.. ఆద్యంతం ఆసక్తికరం! - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సాహిత్య సమావేశం

తెలుగు చిత్ర పరిశ్రమలో అపురూపమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన నటులు వారంతా. వారిలోని మరో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేసింది ఉత్తర అమరికా తెలుగు సంఘం- తానా. ఆయా నటులతో ఆత్మీయ అనుబంధం ఉన్న కవులు, రచయితలతో సాహితీ సమావేశం నిర్వహించింది. అక్కినేని, జగ్గయ్య, భానుమతి, గొల్లపూడి మారుతీరావు వంటి మహామహుల సాహితీ ప్రస్థానాన్ని స్పృశింపజేసింది.

Literary Conference
Literary Conference
author img

By

Published : Feb 1, 2021, 9:57 AM IST

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సాహిత్య సమావేశం

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన తారలు - రాతలు కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలుగు తెరపై సుప్రసిద్ధ తారలైన కొందరి సాహిత్య ప్రస్థానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నటులుగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, భానుమతి, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణిలు రచయితలుగా రాణించిన వైనాన్ని ఆవిష్కృతం చేశారు. ఆయా నటులతో ప్రత్యేక అనుబంధం ఉన్న సాహితీవేత్తలు, పాత్రికేయులు సమావేశంలో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొని.... వారి సాహితీసేవలను వివరించారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదికను తోటకూర ప్రసాద్‌ నిర్వహించారు.

నటుడు, రచయిత, తనికెళ్ల భరణి తన సాహితీ ప్రస్థానాన్ని నెమరువేసుకున్నారు. నాటకాల కోసం రచయితగా మారిన పరిస్థితి, సినిమా రంగప్రవేశాన్ని సాహిత్య వేదిక నిర్వాహకులకు వివరించారు. తెలుగు భాషను కాపాడేందుకు తానా సభ్యులు చేస్తున్న కృషిని భరణి అభినందించారు. తెలుగులో మాట్లాడుతున్నందుకు గర్వంగా ప్రతి ఒక్కరూ భావించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని.. ప్రముఖ వైద్యురాలు, రచయిత్రి కె.వి. కృష్ణకుమారి గుర్తుచేసుకున్నారు. అక్కినేని నటనతో పాటు సాహిత్యంలోనూ సుమున్నత శిఖరమని కొనియాడారు. సాహిత్యం ఉన్నంత కాలం అక్కినేని కూడా మనతోనే ఉంటారని కృష్ణకుమారి అన్నారు.

కొంగర జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి సరైన ఉదాహరణ అని.. ప్రముఖ కవి, సంగీత రచయిత రసరాజు అన్నారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా, నటుడిగా, వ్యాఖ్యాతగా ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. తెలుగు నుడికారం బాగా తెలిసిన కవి జగ్గయ్య అంటూ కొనియాడారు.

తెలుగు ప్రజలకు నటిగా భానుమతి అంటే ఎంత మమకారమో.. ఆమె రాసిన అత్తగారి కథలు అన్నా అంతే ప్రేమ అన్నారు.. ప్రసిద్ధ కవియిత్రి శారదా అశోకవర్ధన్‌. హాస్యరసానికి అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో ఆ విభాగంలో ఆమె చేసిన కృషి మరువలేనిదన్నారు. భానుమతితో తన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు ఎంత గొప్ప నటులో అంతకుమించిన రచయిత, నవలాకారుడు అన్నారు ప్రముఖ కవి కిరణ్‌ప్రభ. గొల్లపూడి నవలలు చిన్ననాటి నుంచే తనపై గొప్ప ప్రభావం చూపాయన్నారు. తొలి కథ నుంచి చనిపోయే ముందు వరకు రాసిన నవల వరకు గొల్లపూడి రాసిన రచనల్లో పదును మాత్రం తగ్గలేదన్నారు.

ఇదీ చదవండి:

సైనిక నియంత్రణలో మయన్మార్​- సూకీ గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.