ETV Bharat / city

తెలంగాణలోని జగిత్యాలలో చిరుత కలకలం.. ఒకరిపై దాడి

మొదట చిరుత పులి అన్నారు... దాని కోసం అటవీ అధికారులు గంటల తరబడి వెతికారు. అయినా చిక్కలేదు... అది పులికాకపోవచ్చు... అడవి పిల్లి కావచ్చని భావించారు. మళ్లీ అదేరోజు రాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఒకరిపై దాడి కూడా చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగింది.

leopard attack on man in jagityala
చిరుత దాడి
author img

By

Published : Jun 20, 2020, 11:56 AM IST

తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో చిరుతపులి కలకలం రేపగా... పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్​ ప్రాంతంలో ఓ ఇంట్లో దూరినట్లు ప్రత్యక్ష సాక్షులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న అటవీ అధికారులు... రెండు గంటలపాటు చిరుతకోసం గాలించారు. అయితే ఆచూకీ లభించకపోవడం వల్ల అడవిపిల్లిగా భావించి అధికారులు వెనుతిరిగారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చిరుత మళ్లీ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న పిల్లి తిరుపతి అనే వ్యక్తిపై దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డాడు.

పోలీసులు, అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి కోసం గాలించినప్పటికీ... ఆచూకీ లభించలేదు. అయితే ఓ భవనంపై ఉంటుందని అనుమానిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు వరంగల్​ రిస్క్​ టీమ్​ కూడా జగిత్యాలకు చేరుకుంది. చిరుత కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.