రాష్ట్రమంతట పక్కగా లాక్ డౌన్ అమలవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడి బతికేవారికి పనులు లేక ఇబ్బందిపడుతున్నరు. అటువంటి వారి కోసమే లాక్‌డౌన్ నుంచి భారీ పరిశ్రమలకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు(ఎన్‌వోసీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా పరిశ్రమల నిర్వాహకుల నుంచి ఒప్పంద పత్రం తీసుకుని అనుమతి ఇవ్వనుంది. రాష్ట్రంలో 925 భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 865, పట్టణ ప్రాంతంలో 60 భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో 68 పరిశ్రమలు
కంటెయిన్‌మెంట్ క్లస్టర్‌లో ఉండగా..
పట్టణ పరిధిలో ఉన్న 60 పరిశ్రమలకూ అనుమతులు ఇవ్వటం కష్టం. మిగిలిన పరిశ్రమలకు ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని 96,967 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో(ఎంఎస్‌ఎంఈ) 24,265 రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 1,620 దరఖాస్తులు మాత్రమే ఎన్‌వోసీ కోరుతూ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్‌కు వచ్చాయి.
ఇది చదవండివైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా! పిల్లలు, యువతలో కనిపించని లక్షణాలు!