మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించగలిగితే... ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని భావించడంతోనే సీఎం మహిళల కోసం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తాడేపల్లి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జిల్లాలోని 6,54,930 మంది మహిళలకు 2,719 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా మొదటి విడతలో 679 కోట్ల రూపాయలు మాఫీ చేశామని తెలిపారు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం చెక్కును అందించారు. మొట్టమొదటిగా పూర్తయిన, సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా పథకంతో మహిళలకు అండగా నిలిచారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో డ్వాక్రా మహిళలకు తొలివిడతగా సుమారు 600 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు.
కృష్ణా జిల్లాలో
జగ్గయ్యపేట పట్టణంలోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 4604 స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతగా మంజూరైన 40 కోట్ల 34 లక్షల రూపాయల చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారని ఆయన తెలిపారు.
గుంటూరు జిల్లాలో..
పరిపాలనలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో దేశంలొనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 వస్థానం దక్కిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కొనియాడారు. రేపల్లె పట్టణంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేపల్లె మండలంలో ఉన్న 1304 డ్వాక్రా సంఘాలకు 43 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో ఉన్న 4వేల 873 డ్వాక్రా సంఘాలకు మొత్తం 170 కోట్లు విడుదల అయ్యినట్లు మోపిదేవి తెలిపారు.
సత్తెనపల్లిలో మహిళా సాధికారత వారోత్సవాలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్లు ప్రారంభించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు ఆ నగదును ఆదాయ మార్గాలకు వినియోగించుకోవాలని సూచించారు.
మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులు అందించారు.
ప్రకాశం జిల్లాలో..
చీరాలలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకంతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబు అన్నారు. రంపచోడవరం వైటీసీలో వైఎస్సార్ ఆసరా కింద మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు.
విజయనగరం జిల్లాలో..
పార్వతీపురం పురపాలక సంఘంలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. మహిళా సమైఖ్య భవనంలో స్వయం శక్తి సంఘాలకు చెక్కు అందజేశారు చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
జిల్లాలోని బొబ్బిలిలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రారంభించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు... వైయస్ఆస్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు బాసటగా నిలవాలని, వారి కుటుంబాలు అభివృద్ధి పథంలో నడవాలని ఆలోచనతో ముఖ్యమంత్రి ఈ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
కర్నూలు జిల్లాలో..
మహిళల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు జిల్లాలో ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హమీ మేరకు పొదుపు మహిళల రుణాలను నాలుగు దఫాల్లో మాఫీ చేస్తున్నామన్నారు.
కృష్ణా జిల్లాలో
మైలవరంలోని వెలుగు కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. మహిళలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు.
కడప జిల్లాలో..
మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్జీవో హోంలో... ఎమ్మెల్సీ జకియా ఖానంతో కలిసి వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం 6900 కోట్లు స్వయం సహాయక సంఘాలకు తొలివిడత కింద రుణమాఫీ చేస్తోందన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ రుణమాఫీకి శ్రీకారం చుట్టారని తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణ విముక్తి కలిగించడానికి వైఎస్సార్ ఆసరా పథకం దోహదపడుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో పి.గన్నవరంలోని ఎంపీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ప్రారంభిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్సార్ ఆసరా పథకం చెక్కును పొదుపు మహిళలకు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి పంపిణీ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పొదుపు మహిళల ఖాతాలో సొమ్ము జమ చేయడం జరిగిందన్నారు.
అనంతపురం జిల్లాలో..
మహిళలంతా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణం పురపాలక కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా మహిళా స్వావలంబన సాధికారిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 3,645 స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా ఫథకం ద్వారా 29.35 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.
విశాఖ జిల్లాలో..
మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని... విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించి 985 స్వయం సహాయక సంఘాలకు తొలివిడతగా 10వేల 900 మంది సభ్యులకు రూ.7 కోట్ల 62 లక్షలను అందజేశారు.
ఇదీ చదవండి: