రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 70,757 పరీక్షలు నిర్వహించగా.. 1,859 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,88,910 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 13 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం మృతుల సంఖ్య 13,595కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,575 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,56,627కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,54,53,520 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:
పెరిగిన కొత్త కేసులు- మరో 41,195మందికి కరోనా
BABY DEATH CASE: చిన్నారి మృతి కేసు ఛేదన.. నిందితురాలు ఎవరంటే..