ETV Bharat / city

రెండున్నరేళ్లలో మూడు దశలుగా సమగ్ర భూ సర్వే: నీరబ్ కుమార్

ఈ నెల 21న కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో సమగ్ర భూసర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో రెండున్నరేళ్ల పాటు ఈ సర్వే జరుగుతుందన్నారు. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అటవీ భూముల మినహా ఇతర స్థిరాస్తులన్నింటినీ సర్వే చేసి వాటికి యూనిక్ ఐటెంటిటీ కార్డులు ఇస్తామని నీరబ్ కుమార్ తెలిపారు.

author img

By

Published : Dec 9, 2020, 8:01 PM IST

nirabh kumar
nirabh kumar
రెండున్నరేళ్లలో మూడు దశలుగా సమగ్ర భూ సర్వే : నీరబ్ కుమార్

రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములు మినహా మిగిలిన అన్నింటినీ రెండున్నరేళ్లలో సమగ్రంగా సర్వే చేస్తామని భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ తెలిపారు. సర్వే చేసిన భూములపై శాశ్వత హక్కు.. రక్షణ కల్పించేందుకు సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరిష్‌ కుమార్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించామని, ఆ గ్రామంలోని 800 మంది రైతుల భూములను సర్వే చేయగా కేవలం 35 మంది నుంచే అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిలో ఇప్పటికే 17 పరిష్కారం కాగా మిగిలిన వాటిని కూడా ఈ నెల 21లోగా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో రెండున్నరేళ్ల పాటు ఈ సర్వే జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.956 కోట్లు కేటాయించిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గరిష్టంగా కేవలం ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసంతో ఈ సర్వే జరుగుతుందని చెప్పారు.

దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేస్తున్నామని... భూమికి సంబంధించిన వివరాలన్నింటినీ సర్వే చేయించి ఉచితంగా సరిహద్దు రాళ్లు వేసి.. తర్వాత యూనిక్‌ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు ఇస్తామని నీరబ్ కుమార్ తెలిపారు. ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాపులు గ్రామంలో అందుబాటులో ఉంచుతామని... రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ చేస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 70 బేస్‌ స్టేషన్లు నెలకొల్పుతామన్నారు. 5 వేల రెవెన్యూ గ్రామాల్లో మొదటి దశ సర్వే ఈనెల 21న ప్రారంభమై, జులై 2021 వరకూ కొనసాగుతుందన్నారు.

ఆ తర్వాత ఆగస్టు 2021 నుంచి 6500 రెవెన్యూ గ్రామాల్లో రెండోవిడత ప్రారంభిస్తామని, 2022 ఏప్రిల్‌ వరకూ కొనసాగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగుతుందన్నారు. 14 వేల సర్వేయర్లను ప్రభుత్వం నియమించిందని... వారందరికీ శిక్షణ ఇస్తున్నామని నీరబ్ కుమార్ చెప్పారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగం వల్ల ఐదు నిమిషాల్లోనే కొలిచిన భూమి వివరాలు వస్తాయని... కచ్చితత్వం స్పష్టంగా ఉంటుందన్నారు. ప్రపంచంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, 100 ఏళ్ల తర్వాత మళ్లీ సమగ్ర సర్వే జరుగుతోందని లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ గిరీష్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి : స్థిరాస్తులన్నింటికీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.